Wednesday, July 22, 2026
Homeవార్తలుఅంబెడ్కర్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

అంబెడ్కర్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

గన్నేరువరం మండలంలోని పారువెల్ల గ్రామ అంబేద్కర్ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . గౌరవ అధ్యక్షులుగా అలువాలా కోటి, అధ్యక్షులుగా గువ్వల లచ్చయ్య, ఉపాధ్యక్షులు గా లింగంపల్లి పోశయ్య, ప్రధాన కార్యదర్శిగా నగునూరి తిరుపతి, ప్రచార కార్యదర్శిగా ఎదురుగట్ల సురేష్, కొమురయ్య, కోశాధికారిగా మంద సురేష్,కార్యవర్గ సభ్యులుగా మంకాల రామయ్య,లింగంపల్లి పోచయ్య, మాంకాల నర్సయ్య, ఎదురుగట్ల పోషయ్య, లింగంపల్లి మల్లయ్య,లింగంపల్లి లక్ష్మయ్య, లింగంపల్లి భూమయ్య, లింగంపల్లి అంజయ్య,మంకాల మల్లయ్య లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి కార్యవర్గ సభ్యులందరికీ శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా నియమకమైన సభ్యులు సంఘం బలోపేటానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు పాల్గొన్నారు.

Related News

తాజా వార్తలు