గన్నేరువరం: మనకొండూరు నియోజకవర్గంలో గన్నేరువరం మండలం ప్రత్యేకమని మరోసరి రుజువైందని తాడూరి వంశీ కృష్ణారెడ్డి చెప్పారు.మండల కేంద్రంలో ఆయన విలేకరులతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఎలాంటి ఉద్యమం అయినా గన్నేరువరం మండలం నుంచే పురుడు పోసుకొని ప్రతి మండలానికి దిశానిర్దేశంగా నిలుస్తుందని తెలిపారు.
గతంలో రోడ్డు సమస్య పరిష్కారానికి గన్నేరువరం మండలం నుంచే గత శాసన సభ్యులకు నిరసన సెగ ప్రారంభమై అధికారం కోల్పోడానికి ముఖ్య భూమిక పోషించిందని, ఇప్పుడు కూడా అలానే మొన్న జరిగిన యువజన సంఘాల ధర్నా కార్యక్రమం విజయవంతం కావడంతో మిగతా మండలాలు కూడా తమ సమస్యలపై నిరసన తెలిపేందుకు ముందుకు కదిలాయని వివరించారు.
తిమ్మాపూర్,బెజ్జంకి మండలానికి సంబంధించి రోడ్ల సమస్యలపైనా సంబంధిత ప్రజలు, అఖిల పక్ష రాజకీయ పార్టీల నాయకులు నడుంకట్టారని చెప్పారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలను మోసం చేయాలని చూస్తే భవిష్యత్తులో ఆయన రాజకీయ మనుగడ శూన్యమని వంశీ కృష్ణారెడ్డి హెచ్చరించారు.

