Tuesday, July 21, 2026
Homeరాజకీయాలువిద్యార్థుల‌కు యూనిఫార్మ్స్ అందించిన ఎమ్మెల్యే

విద్యార్థుల‌కు యూనిఫార్మ్స్ అందించిన ఎమ్మెల్యే

పాలకుర్తి: కొడకండ్ల మండలంలోని పాకాల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫార్మ్స్, వాటర్ బాటిళ్ల‌ను ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి గురువారం పంపిణీ చేశారు. విద్యార్థుల‌ను క్రీడ‌ల్లో ప్రోత్సహించేందుకు దాతలు తూడి యుగంధర్ రెడ్డి, నారెడ్డి వెంకట్ రెడ్డి స్పోర్ట్స్ యూనిఫార్మ్స్, వాటర్ బాటిళ్ల‌ను స‌మ‌కూర్చ‌గా విద్యార్థుల‌కు ఎమ్మెల్యే అంద‌జేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుతో పాటు క్రీడల్లో విద్యార్థుల‌ను ప్రోత్సహించడం చాలా ముఖ్య‌మ‌ని. పిల్లల వెనుక ఇలాంటి దాతలు నిలబడడం పాఠశాలకు పెద్ద ఆశీర్వాదమ‌ని పేర్కొన్నారు. దాతలు తూడి యుగంధర్ రెడ్డి, నారెడ్డి వెంకట్ రెడ్డికి ఎమ్మెల్యే, పాఠశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ యూనిఫార్మ్స్ అందడంతో పిల్లల్లో ఆనందం వెల్లివిరిసింది. క్రీడా కార్యక్రమాల్లో మరింత ఉత్సాహంగా పాల్గొనేలా ఈ సౌకర్యాలు ఉప‌క‌రిస్తాయ‌ని ఉపాధ్యాయులు తెలిపారు.

Related News

తాజా వార్తలు