Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుకేటీఆర్‌పై క‌క్ష సాధింపు కోస‌మే ఈ కేసు..

కేటీఆర్‌పై క‌క్ష సాధింపు కోస‌మే ఈ కేసు..

-కేటీఆర్ పై క‌క్ష సాధింపు కోస‌మే బ‌నాయించిండ్రు
-ఆయ‌న‌పై విచార‌ణ చేయాల‌న్న నిర్ణ‌యాన్ని ఖండిస్తున్నం
-కేటీఆర్ సేన క‌రీంన‌గ‌ర్ జిల్లా అధ్య‌క్షుడు గూడూరి సురేశ్‌

క‌రీంన‌గ‌ర్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం కక్ష‌ సాధింపు చర్యల‌కు పాల్ప‌డుతున్న‌ద‌ని కేటీఆర్ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గూడూరి సురేశ్ మండిప‌డ్డారు. ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై పెట్టిన కేసు బేకార్ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో విచారణకు గవర్నర్ అనుమతి తెలపడంతో కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ ఎస్‌పై చేస్తున్న కుట్రలు తేట‌తెల్ల‌మ‌య్యాయ‌ని విమ‌ర్శించారు.

బీఆర్ఎస్‌ను క‌ట్ట‌డి చేసేందుకు, కేటీఆర్ ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్‌, బీజేపీ క‌లిసి త‌ప్పుడు కేసు బ‌నాయించాయ‌ని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల్లో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేఖత వచ్చినపుడు, ఎన్నిక‌లు వచ్చినపుడు ఇలాంటి కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చి సీఎం రేవంత్ రెడ్డి డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు.

రెండేండ్లుగా ఫార్ములా ఈ రేస్‌పై విచారణ పేరుతొ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయార‌ని, ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కక్ష‌ పూరిత రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపింద‌న్నారు. అందులో భాగంగానే విచారణ పేరిట కేటీఆర్ ను ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఫార్ములా ఈ కార్ రేస్‌తో కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిల‌బెట్టార‌ని సురేశ్‌ గుర్తుచేశారు.

Related News

తాజా వార్తలు