Tuesday, July 21, 2026
Homeరాజకీయాలుకేటీఆర్‌పై రాజకీయకక్ష సాధింపు చర్యలు సరికాదు

కేటీఆర్‌పై రాజకీయకక్ష సాధింపు చర్యలు సరికాదు

HYD:సమాజంలోని ప్రజల సమస్యలపై మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్‌ఎస్ నాయకుడు కొమ్ముల నరేందర్ మండిపడ్డారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారంటూ ఆయన కాంగ్రెస్‌ సర్కార్‌పై ఫైర్ అయ్యారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నడు రేవంత్ రెడ్డి..ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు.అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని..సీఎం రేవంత్ రెడ్డి కుట్రలను న్యాయపరంగా ఎదుర్కొంటామని కొమ్ముల నరేందర్ పేర్కొన్నారు.

Related News

తాజా వార్తలు