Wednesday, July 22, 2026
Homeవార్తలుముగ్గురు ఉపాధ్యాయుల స‌స్పెన్ష‌న్‌

ముగ్గురు ఉపాధ్యాయుల స‌స్పెన్ష‌న్‌

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ముగ్గురు ప్ర‌భుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ డీఈవో గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హుజూరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుడు ప్రవీణ్ కుమార్, ఇదే పాఠశాలలో ఫిజికల్ సైన్స్ బోధించే సమ్మయ్య, హుజూరాబాద్ మండలం చెల్పూర్ పాఠశాల ఫిజికల్ సైన్స్ టీచర్ ఐలయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

వీరిలో ప్రవీణ్ కుమార్, సమ్మయ్య మద్యం సేవించి పాఠశాలకు హాజరైనట్టు ఆరోపణలు వ‌చ్చాయి. ఐలయ్య విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం, పాఠశాల కార్యక్రమాల్లో సహకరించకపోవడం, విద్యార్థులను నిరుత్సాహ ప‌ర‌చ‌డం వంటి చర్యలకు పాల్పడుతున్నట్టు తేల‌డంతో వారిపై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. ముగ్గురు ఉపాధ్యాయులు తమ ప్రవర్తన మార్చుకోకుండా పదే పదే ఇవే చర్యలకు పాల్పడటంతో కలెక్టర్ ఆదేశాల మేర‌కు సస్పెండ్ చేసినట్టు డీఈవో పేర్కొన్నారు.

Related News

తాజా వార్తలు