గన్నేరువరం మండల కేంద్రంలని జ్పడీ ఉన్నత పాఠశాలతో పాటు జంగపల్లి విద్యార్థులకు గురువారం బీజేపీ నాయకులు సైకిళ్లు పంపిణీ చేశారు. మోడీ కానుకగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. బండి సంజయ్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మోడీ కానుకగా ఇవ్వాలని తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు మేలు కలిగిస్తున్నదని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజుల కోసం సైతం బండి సంజయ్ తన జీతం డబ్బుల నుండి 15 లక్షలు చెల్లించారని గుర్తుచేశారు. ఒక పేద విద్యార్థి నుంచి బండి సంజయ్ కేంద్రమంత్రిగా ఎదగడాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 20వేల సైకిళ్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు కూడా త్వరలో సైకిళ్లను పంపిణీ చేయనన్నట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మోడీ కిట్ పేరుతో సహాయాన్ని అందించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు
కేంద్ర మంత్రి సాయంతో సౌకర్యాలు:ఎంఈవో రామయ్య
కార్యక్రమంలో ఎంఈవో రామయ్య మాట్లాడుతూ గన్నేరువరం పాఠశాలలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో వాష్ రూమ్స్, బోరుబావి, పాఠశాల గేట్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గత సంవత్సరం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా కింద ఎంపిక చేసిన స్కూళ్లలో గన్నేరువరం ఒకటి అని చెప్పారు. ఇందుకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని తెలిపారు. వీటిని పాఠశాలలో మౌలిక వసతుల కోసం కేటాయించినట్టు చెప్పారు. బోరుబావి, గేటు, కిచెన్ గార్డెన్ తదితరాలను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద రూ.5 లక్షలను బండి సంజయ్ మంజూరు చేశారని, వాటిని బాలికల వాష్ రూమ్స్ కోసం కేటాయించామని వివరించారు. కరీంనగర్ జిల్లాలోని ప్రతి పాఠశాలకు విద్యార్థులకు వంట కోసం 2 చొప్పున సిలిండర్లు ఉచితంగా అందజేశారని, ఇక్కడి పాఠశాలకు కూడా కుక్కర్, స్టవ్‌ను ఇస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారని తెలిపారు.
విద్యార్థులకు సైకిళ్లు అందించడం హర్షణీయం : హెచ్ఎం శారద, జంగపల్లి హై స్కూల్
హెచ్ఎం కొత్తపల్లి శారద మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టిన రోజును పురస్కరించుకొని పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లను అందజేయడం ఎంతో హర్షణీయమని, ఇది పేద విద్యార్థులకు ఎంతో ఆసరా అవుతుందని చెప్పారు. నడుచుకుంటూ రావడం వల్ల సమయంపై ప్రభావం పడుతుందని, దూరం నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సైకిళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నాడి రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, సీనియర్ నాయకులు ఎలేటి చంద్రారెడ్డి, గుండ్రెడ్డి మల్లారెడ్డి, విలాసాగరం రామచంద్రం, అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, నాయకులు పుల్లెల రాము, బద్దం అనంతరెడ్డి, పుల్లెల జగన్ మోహన్, అటికెం రామచంద్రం, బూమాడి సురేందర్ రెడ్డి, కొలుపుల వేణు, నరసింహారెడ్డి, కాంతాళ రాజిరెడ్డి, వినయ్, జాలి శ్రీనివాస్ రెడ్డి, కాంతాల మధుకర్ రెడ్డి, విలాసాగరం రాయమల్లు, రంగనవేని కుమార్, రాజకుమార్, గూడూరి జగన్, సత్యనారాయణ, బొమ్మకంటి శ్రీను, గూడూరి లక్ష్మీరాజం, కొలుపుల అనిల్ పాల్గొన్నారు.

